devotional news

తిరుమలలో వైభవంగా భాగ్ సవారి ఉత్సవం

 


 తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజు నిర్వహించే భాగ్ సవారి ఉత్సవం గురువారం సాయంత్రం వైభవంగా జరిగింది.

అనంతాళ్వారుల భక్తికి గుర్తుగా..

పురాణ ప్రాశస్త్యం ప్రకారం, శ్రీఅనంతాళ్వారుల భక్తిని పరీక్షించేందుకు శ్రీదేవి సమేతంగా శ్రీవేంకటేశ్వరస్వామివారు మానవ రూపంలో అనంతాళ్వారుల పూదోటకు వచ్చినట్లు చెబుతారు. అక్కడ పూలు కోస్తున్న అమ్మవారిని అనంతాళ్వారులు అశ్వత్థ వృక్షానికి కట్టివేస్తారు.

స్వామివారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఆయన అప్రదక్షిణ దిశగా పరుగెత్తి ఆలయంలోకి ప్రవేశించి అదృశ్యమవుతారు. అనంతరం వచ్చినది సాక్షాత్తు స్వామివారేనని తెలుసుకున్న అనంతాళ్వారులు పశ్చాత్తాపం చెంది అమ్మవారిని విడిపించి, పూల బుట్టలో కూర్చోబెట్టి స్వామివారి చెంతకు తీసుకెళ్తారు.

అప్రదక్షిణంగా అనంతాళ్వారు తోటకు..

తన భక్తుని భక్తికి మెచ్చిన స్వామివారు, అనంతాళ్వారుల కోరిక మేరకు ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాల మరుసటి రోజు తన తోటకు అప్రదక్షిణంగా వచ్చి తిరిగి ఆలయంలోకి ప్రవేశిస్తానని అభయమిచ్చినట్లు పురాణ కథనం.

ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ గురువారం సాయంత్రం 4 గంటలకు శ్రీవారు వైభవోత్సవ మండపం నుంచి బయలుదేరి అప్రదక్షిణంగా అనంతాళ్వారు తోటకు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు అందుకున్న అనంతరం తిరిగి ఆలయంలోకి ప్రవేశించడంతో భాగ్ సవారి ఉత్సవం ముగిసింది.

దివ్యప్రబంధ పారాయణం

ఉత్సవానికి ముందు శ్రీవారి ఆలయానికి నైరుతి దిశలో ఉన్న పురుశైవారి తోటలో అనంతాళ్వారు వంశీకులు నాళాయిర దివ్యప్రబంధాన్ని పారాయణం చేశారు.

ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చినజీయర్ స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో భాస్కర్, పేష్కార్ రామకృష్ణ, ఇతర ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ.. అక్టోబర్ 1, 5 తేదీల్లో బ్రేక్ దర్శనాలు రద్దు

September 30, 2026

 తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో...

View Post

తిరుమలలో వైభవంగా భాగ్ సవారి ఉత్సవం

September 25, 2026

  తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక బà...

View Post

పూర్ణాహుతితో ముగిసిన శ్రీ గోవిందరాజస్వామివారి పవిత్రోత్సవాలు

September 25, 2026

 తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడు...

View Post

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

September 24, 2026

 తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్స...

View Post

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

September 24, 2026

 తిరుమల శ్రీవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు వైà...

View Post

Copyright © Venlax Devotional. All rights reserved.

👥 Total Site Visits: 227952