Sanatha Secrets

తిరుమల శ్రీవారికి నిత్య కైంకర్యాలు ఎలా జరుగుతాయి..?


కలియుగ వైకుంఠం తిరుమలలో... తెల్లవారుజామున శ్రీవారిని మేల్కొలిపే సుప్రభాతం నుంచి రాత్రి పవళింపు సేవ వరకు నిత్య కైంకర్యాలు ఎలా జరుగుతాయనేది ఇప్పుడు తెలుసుకుందామా..?

తెల్లవారుజామున 3:00 గంటలకు: 'కౌసల్యా సుప్రజారామ...' అంటూ సుప్రభాత సేవతో గర్భాలయ తలుపులు తెరుస్తారు. స్వామివారికి వెన్న నైవేద్యం సమర్పిస్తారు.

ఉదయం 3:30 నుండి 5:30 వరకు..ఆలయ శుద్ధి అనంతరం, పరిమళ భరిత పుష్పాలతో 'తోమాల సేవ' నిర్వహిస్తారు. ఆ తర్వాత 'కొలువు' దర్బార్‌లో నిన్నటి లెక్కలు, నేటి పంచాంగం స్వామికి వినిపించి, వెయ్యి నామాలతో 'సహస్ర నామార్చన' చేస్తారు.

ఉదయం 5:30 కి మొదటి ఘంట.. ఆలయ గంటలు మోగుతుండగా లడ్డూ, వడ, పాయసం లాంటి మహాప్రసాదాలను నివేదిస్తారు.

మధ్యాహ్నం 12:00 కి రెండో ఘంట... రెండోసారి గంట మ్రోగించి శుద్ధాన్నం, పులిహోరను దేవునికి సమర్పిస్తారు.

రాత్రి 7:00 గంటలకు..రాత్రి తోమాల సేవ, అష్టోత్తర శతనామార్చన, దద్దోజనం నైవేద్యం ఉంటాయి.

రాత్రి 11:30 కి ఏకాంత సేవ... అన్నమయ్య వంశీయుల లాలిపాటల నడుమ భోగ శ్రీనివాసమూర్తిని బంగారు ఊయలలో పవళింపజేస్తారు. రాత్రి వేళ బ్రహ్మదేవుడు వచ్చి పూజించడానికి వీలుగా గర్భాలయంలో మూడు వెండి గిన్నెల్లో పవిత్ర జలాలను ఉంచి తలుపులు మూసివేస్తారు. ఏడుకొండలవాడికి ఇలా రోజూ తిరుమలలో జరిగే ప్రతి నిమిషం ఒక పండగే, ప్రతి రోజూ ఒక బ్రహ్మోత్సవమే..!గోవిందా... గోవిందా...

Share This Article:

నారాయణవనం బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగింపు

June 6, 2026

 Tirumala Tirupati Devasthanams ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బ్రహ్మోత్సవాలు నారాయణవనంలో భక్తి శ్రద్ధలతో, సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించేలా జరిగాయి. ...

View Post

తిరుమల అప్డేట్: భక్తుల భారీ రద్దీ — దర్శనానికి సుమారు 15 గంటల నిరీక్షణ

June 6, 2026

Tirumalaలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో సాధారణ దర్శనానికి సుమారు 15 గంటల సమ...

View Post

తిరుమల లడ్డూ విక్రయాల్లో రికార్డు: మే నెలలో 1.21 కోట్ల లడ్డూల అమ్మకాలు

June 4, 2026

తిరుమలలో భక్తుల రద్దీతో పాటు లడ్డూ ప్రసాదానికి ఉన్న డిమాండ్ కొత్త రికార్డును సృష్టించింది. 2026 మే నెలలో ఏకంగా 1.21 కోట్ల లడ్డూలు విక్...

View Post

కల్తీ నెయ్యి కేసు: పలు ప్రాంతాల్లో ఈడీ విస్తృత సోదాలు

June 4, 2026

కల్తీ నెయ్యి (Adulterated Ghee) సరఫరా వ్యవహారానికి సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా పలు ప్రాంత...

View Post

పెన్నహోబిళ ఆలయ అభివృద్ధికి భారీ ప్రణాళికలు – భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి

June 3, 2026

పెన్నహోబిళలోని ప్రసిద్ధ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి భారీ స్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు దేవాదాయ శాఖ అధికారు...

View Post

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ – 10 గంటల్లోనే శ్రీవారి దర్శనం పూర్తి

June 3, 2026

 తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పరిధిలోని తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఈ రోజు తగ్గినట్లు అధికారులు తెలిపారు. సాధారణ రోజులతో ...

View Post

Copyright © Venlax Devotional. All rights reserved.

👥 Total Site Visits: 127194