Sanatha Secrets

ప్రతికూల శక్తుల పీడ వదలాలంటే.. హనుమంతుడి చిత్రపటాన్ని ఏ దిశలో ప్రతిష్టించాలి..?


భక్తజన రక్షకుడు, రామదూత హనుమంతుడు కొలువై ఉన్న చోట ఎలాంటి ప్రతికూల శక్తులు దరిచేరవు. ‘యత్ర యత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్’ అన్నట్లుగా రామనమ స్మరణ ఎక్కడైతే వినిపిస్తుందో, అక్కడ హనుమ అదృశ్య రూపంలో ఉంటాడని శాస్త్ర వచనం. కేవలం భక్తితో పూజించడమే కాకుండా, మన గృహంలో ఆ స్వామి పటాన్ని శాస్త్రోక్తంగా, సరైన దిశలో ఉంచడం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తాయి.
చైత్ర పౌర్ణమి..హనుమజ్జయంతి వైభవం..

వేద పంచాంగం ప్రకారం, చైత్ర మాసపు పౌర్ణమి తిథి నాడు కేసరీ నందనుడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర దినాన హనుమంతుడిని ప్రత్యేకంగా ఆరాధించడం, ఉపవాసం పాటించడం వల్ల జాతకంలోని దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా శని ప్రభావంతో ఇబ్బంది పడేవారు, మానసిక ఆందోళనలతో సతమతమయ్యేవారు ఈ రోజున బజరంగబలిని శరణు వేడితే, ఆయన అనుగ్రహంతో జీవితంలో వెలుగులు నిండుతాయని నమ్ముతారు.

వాస్తు శాస్త్రం...దిశానిర్దేశం..

మతపరమైన నమ్మకాలతో పాటు వాస్తు శాస్త్రం కూడా హనుమంతుని పటాన్ని ఉంచే విషయంలో స్పష్టమైన సూచనలు చేస్తోంది. సరైన దిశలో స్వామి చిత్రాన్ని ఉంచడం వల్ల ఇంటి ఆవరణలో శాంతి, నెమ్మది నెలకొంటాయి.

అంతరార్థం..దిశలు.. ఫలితాలు

ఉత్తర దిశ: అభయానికి చిరునామా సాధారణంగా దయ్యాలు, భూత ప్రేతాలు వంటి ప్రతికూల శక్తులు ఒక దిశ నుంచి ప్రవేశిస్తాయని పురాతన విశ్వాసం. వాస్తు ప్రకారం, ఉత్తర దిశను యమధర్మరాజుకు సంబంధించిన ప్రతికూల ప్రభావాల నుంచి రక్షించేదిగా భావిస్తారు.

ఎందుకు ఉత్తర దిశ?: హనుమంతుని ముఖం లేదా పటం ఉత్తర దిశగా ఉన్నప్పుడు, అది ఇంటిపై పడే దుష్ట దృష్టిని అడ్డుకుంటుంది.

ఫలితం: ఇంట్లోకి భయం ప్రవేశించదు. కుటుంబ సభ్యులకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అకాల మృత్యు భయం తొలగుతుంది.

ఎక్కడ ఉంచకూడదు..?

హనుమంతుడు పరమ బ్రహ్మచారి, నిత్య తపస్వి. ఆయన పటాన్ని ఉంచేటప్పుడు కొన్ని నియమాలు తప్పనిసరి. బెడ్‌రూమ్‌లో హనుమ పటాన్ని ఉంచడం నిషిద్ధం. ఇది గృహస్థులకు మానసిక అశాంతిని కలిగిస్తుందని, స్వామి పట్ల అగౌరవమని శాస్త్రం చెబుతోంది. ఖాళీ స్థలం ఉందని మెట్ల కింద దేవుని పటాలు పెట్టకూడదు. దానివల్ల ఇంటి ప్రగతి కుంటుపడుతుంది. అశుచిగా ఉండే ప్రదేశాలు, మురికి కాలువలకు దగ్గరగా స్వామి చిత్రాన్ని ఉంచవద్దు.

కూర్చున్న భంగిమ-పంచముఖ హనుమ..

ఇంట్లో ఎప్పుడూ కూర్చున్న భంగిమలో ఉన్న హనుమంతుని చిత్రం ఉంచడం శుభప్రదం. ఇది ఇంట్లో సంపద, సంతోషం స్థిరంగా ఉండటానికి తోడ్పడుతుంది.

పంచముఖి హనుమ..అంటే ఐదు ముఖాలు కలిగిన ఆంజనేయుని చిత్ర పటాన్ని ఇంటి ప్రధాన ద్వారం పైన లేదా గదిలో ఉంచడం వల్ల శత్రు బాధలు తొలగిపోయి, విజయం లభిస్తుందని భావిస్తారు.

ఆచరణ-ప్రతిష్టాపన, మంత్రం..

హనుమజ్జయంతి లేదా మంగళవారం వంటి పవిత్ర దినాన స్వామి పటాన్ని ప్రతిష్టించాలి. ఉదయాన్నే స్నానం ఆచరించి, సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించాలి. పటాన్ని లేదా విగ్రహాన్ని గంగాజలంతో లేదా పవిత్ర జలంతో శుద్ధి చేయాలి. సింధూరం అంటే హనుమకు అత్యంత ప్రీతి. పటానికి సింధూర తిలకం పెట్టి, ఎర్రటి పూలతో పూజించాలి. పూజ చేసే సమయంలో ఈ క్రింది మంత్రాన్ని 108 సార్లు జపించడం విశేష ఫలితాలనిస్తుంది:

“ఓం హ్రాం హనుమతే నమః” భక్తితోనే ముక్తి..

కేవలం పటాన్ని ఒక దిశలో ఉంచడమే కాకుండా, హనుమంతుని వంటి సేవా నిరతిని, క్రమశిక్షణను అలవరచుకోవడం ముఖ్యం. భయాలను జయించాలన్నా, విజయ శిఖరాలను అధిరోహించాలన్నా పవనపుత్రుని ఆరాధన ఒక దివ్యౌషధం. పైన పేర్కొన్న వాస్తు నియమాలు పాటిస్తూ, నిష్కల్మషమైన భక్తితో ఆ బజరంగబలిని ప్రార్థిస్తే, మీ ఇల్లు ఆనంద నిలయంగా మారుతుంది.

Share This Article:

నారాయణవనం బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగింపు

June 6, 2026

 Tirumala Tirupati Devasthanams ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బ్రహ్మోత్సవాలు నారాయణవనంలో భక్తి శ్రద్ధలతో, సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించేలా జరిగాయి. ...

View Post

తిరుమల అప్డేట్: భక్తుల భారీ రద్దీ — దర్శనానికి సుమారు 15 గంటల నిరీక్షణ

June 6, 2026

Tirumalaలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో సాధారణ దర్శనానికి సుమారు 15 గంటల సమ...

View Post

తిరుమల లడ్డూ విక్రయాల్లో రికార్డు: మే నెలలో 1.21 కోట్ల లడ్డూల అమ్మకాలు

June 4, 2026

తిరుమలలో భక్తుల రద్దీతో పాటు లడ్డూ ప్రసాదానికి ఉన్న డిమాండ్ కొత్త రికార్డును సృష్టించింది. 2026 మే నెలలో ఏకంగా 1.21 కోట్ల లడ్డూలు విక్...

View Post

కల్తీ నెయ్యి కేసు: పలు ప్రాంతాల్లో ఈడీ విస్తృత సోదాలు

June 4, 2026

కల్తీ నెయ్యి (Adulterated Ghee) సరఫరా వ్యవహారానికి సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా పలు ప్రాంత...

View Post

పెన్నహోబిళ ఆలయ అభివృద్ధికి భారీ ప్రణాళికలు – భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి

June 3, 2026

పెన్నహోబిళలోని ప్రసిద్ధ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి భారీ స్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు దేవాదాయ శాఖ అధికారు...

View Post

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ – 10 గంటల్లోనే శ్రీవారి దర్శనం పూర్తి

June 3, 2026

 తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పరిధిలోని తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఈ రోజు తగ్గినట్లు అధికారులు తెలిపారు. సాధారణ రోజులతో ...

View Post

Copyright © Venlax Devotional. All rights reserved.

👥 Total Site Visits: 127299