నారాయణవనం బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగింపు
June 6, 2026
Tirumala Tirupati Devasthanams ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బ్రహ్మోత్సవాలు నారాయణవనంలో భక్తి శ్రద్ధలతో, సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించేలా జరిగాయి. ...
View Post
జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడంటేనే చాలా మందిలో ఒక రకమైన భయం, ఆందోళన నెలకొంటాయి. శని మహాదశ, ఏల్నాటి శని (సడే సతి), లేదా అర్ధాష్టమ శని అనగానే ఏదో కీడు జరుగుతుందని భయపడతారు. కానీ, శనిదేవుడు కేవలం శిక్షించేవాడు మాత్రమే కాదు, ఆయన 'కర్మ ఫల ప్రదాత'. అంటే మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇచ్చే న్యాయమూర్తి. మీ కర్మలు బాగుంటే, శని కాలం మీకు రాజయోగాన్ని కూడా ప్రసాదిస్తుంది.
శని దేవుడు ఎవరిపై కరుణ చూపుతాడు..?శని దేవుడి అనుగ్రహం పొందాలంటే కేవలం పూజలు మాత్రమే సరిపోవు, మన ప్రవర్తన కూడా ముఖ్యం. కష్టపడి పనిచేసే వారు, ఇతరుల హక్కులను కాలరాయకుండా ఉండేవారికి శని ఎప్పుడూ రక్షణగా ఉంటాడు. తల్లిదండ్రులను గౌరవించి, వృద్ధులకు సేవ చేసే వారిపై శని ప్రభావం సానుకూలంగా ఉంటుంది. మద్యపానం, మాంసాహారం వంటి అలవాట్లకు దూరంగా ఉంటూ, సాత్విక జీవనం గడిపేవారికి శని దోషాలు దరిచేరవు.
హనుమత్ భక్తి - శని దోషానికి విరుగుడు..పురాణ గాథల ప్రకారం, రావణుడి బంధీగా ఉన్న శనిదేవుడిని హనుమంతుడు రక్షించాడు. ఆ సమయంలో హనుమ భక్తులను తాను ఎప్పుడూ ఇబ్బంది పెట్టనని శని దేవుడు మాట ఇచ్చాడు.శనివారాల్లో సుందరకాండ పఠించడం లేదా హనుమాన్ చాలీసా జపించడం వల్ల శని దోష తీవ్రత తగ్గుతుంది.
పరిహారాలు - పుణ్య కర్మలు..శని దేవుని ఆశీస్సులు లభించాలంటే ఏమేం పరిహారాలు ఆచరించాలి.. అంటే..?
రావి చెట్టు పూజ..శనివారం సాయంత్రం రావి చెట్టు కింద ఆవనూనెతో దీపం వెలిగించాలి. రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారని నమ్మకం, కాబట్టి అక్కడ దీపారాధన చేస్తే శని పీడ వదులుతుంది. మూగ జీవులను, ముఖ్యంగా కుక్కలు,కాకులను హింసించకూడదు. వాటికి ఆహారం పెట్టడం వల్ల శని దేవుడు ప్రసన్నుడవుతాడు.
శని దేవుని ఆగ్రహానికి గురయ్యే వారు ఎవరు..?కొన్ని పనులు చేయడం వల్ల శని దేవుని కఠిన శిక్ష తప్పదని శాస్త్రాలు చెబుతున్నాయి. పేదలను, స్త్రీలను, నిస్సహాయులను వేధించే వారిని శనిదేవుడు ఎన్నటికీ క్షమించడు.కోర్టులో తప్పుడు సాక్ష్యాలు చెప్పడం లేదా ఇతరుల వెనుక గోతులు తవ్వడం వంటి పనులు శని ఆగ్రహానికి కారణమవుతాయి. తనను కన్న తల్లిదండ్రులను, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను అవమానించే వారికి శని దశ కష్టతరంగా మారుతుంది.శని భయం కంటే భక్తి ముఖ్యం. మనం చేసే ప్రతి పనిని గమనించే శని దేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే 'సేవ, సత్యం, కరుణ' అనే మార్గాల్లో నడవడమే ఉత్తమ మార్గం. మంచి మనసుతో చేసే పనులే మనకు రక్షణ కవచాలుగా మారుతాయి.
June 6, 2026
Tirumala Tirupati Devasthanams ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బ్రహ్మోత్సవాలు నారాయణవనంలో భక్తి శ్రద్ధలతో, సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించేలా జరిగాయి. ...
View PostJune 6, 2026
Tirumalaలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో సాధారణ దర్శనానికి సుమారు 15 గంటల సమ...
View PostJune 4, 2026
తిరుమలలో భక్తుల రద్దీతో పాటు లడ్డూ ప్రసాదానికి ఉన్న డిమాండ్ కొత్త రికార్డును సృష్టించింది. 2026 మే నెలలో ఏకంగా 1.21 కోట్ల లడ్డూలు విక్...
View PostJune 4, 2026
కల్తీ నెయ్యి (Adulterated Ghee) సరఫరా వ్యవహారానికి సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా పలు ప్రాంత...
View PostJune 3, 2026
పెన్నహోబిళలోని ప్రసిద్ధ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి భారీ స్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు దేవాదాయ శాఖ అధికారు...
View PostJune 3, 2026
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పరిధిలోని తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఈ రోజు తగ్గినట్లు అధికారులు తెలిపారు. సాధారణ రోజులతో ...
View Post