Sanatha Secrets

రావణుడు రాక్షసుడి శాపం వెనుక దాగిన పరమార్థం గురించి తెలుసా..?


రామాయణం అంటేనే చెడుపై మంచి సాధించిన విజయం.. అధర్మంపై ధర్మం పొందిన గెలుపు. లోకకంటకుడైన రావణుడిని సంహరించేందుకు సాక్షాత్తూ ఆ మహావిష్ణువే రాముడిగా అవతరించాడు. అయితే, పండితుడు, శివభక్తుడైన రావణుడు అసలు రాక్షసుడిగా ఎందుకు పుట్టాల్సి వచ్చింది..? దీని వెనుక వైకుంఠంతో ముడిపడి ఉన్న రహస్యం ఏంటి..?

వైకుంఠ ద్వారపాలకులు.. శాపగ్రస్తులు..

శ్రీమహావిష్ణువు నివసించే వైకుంఠానికి జయ, విజయులు అనే ఇద్దరు ద్వారపాలకులు ఉండేవారు. వారు నిరంతరం స్వామి సేవలో తరిస్తూ, ఆయనకు అత్యంత ప్రియమైన భక్తులుగా ఉండేవారు. ఒకానొక సమయంలో బ్రహ్మ మానస పుత్రులైన సనకసనందనాదులు విష్ణు దర్శనం కోసం వైకుంఠానికి వస్తే.. పసిబాలుర రూపంలో ఉన్న వారిని చూసి, జయ,విజయులు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీనిని అవమానంగా భావించిన ఋషులు.. సత్యలోక నివాసులైన మాకే అడ్డు చెబుతారా..? మీరు భూలోకంలో రాక్షసులుగా జన్మించండి' అని శపించారు.

మూడు జన్మలతో ముక్తి మార్గం..

శాపం విన్న ద్వారపాలకులు తమ తప్పు తెలుసుకుని క్షమించమని వేడుకోగా, శాపాన్ని వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదని ఋషులు సెలవిచ్చారు. అయితే, సాక్షాత్తు ఆ శ్రీహరి చేతిలోనే మరణం పొందితే, త్వరగా శాపవిముక్తి కలిగి తిరిగి వైకుంఠానికి చేరుకుంటారని మార్గం చూపారు. అలా జయ, విజయులు మూడు యుగాలలో మూడు జంటలుగా జన్మించారు.

కృతయుగంలో..

హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. వీరిని వరాహ, నరసింహస్వామి అవతారాల్లో సంహరించారు.

త్రేతాయుగంలో..

రావణుడు, కుంభకర్ణుడు. శ్రీరామచంద్రుని చేతిలో వీరికి మోక్షం లభించింది.

ద్వాపరయుగంలో..

శిశుపాలుడు, దంతవక్రుడు. శ్రీకృష్ణుని సుదర్శన చక్రానికి బలయ్యి మళ్లీ వైకుంఠానికి చేరుకున్నారు.

విముక్తి మాత్రమే..!

రావణుడు చేసిన ప్రతి చర్య వెనుక తన ప్రభువు దగ్గరకు చేరుకోవాలనే తపన ఉంది. శ్రీరాముని చేతిలో మరణిస్తేనే తనకు శాపవిముక్తి కలుగుతుందని ఆ పండితుడికి తెలుసు. అందుకే పైకి రాక్షసత్వాన్ని ప్రదర్శించినా, అంతర్గతంగా ఆయన రామబాణం తగలడం ద్వారానే ప్రాణాలను వదలాలని వేచి చూశాడు.

పురాణాల ప్రకారం..

ఈ విశేషమైన కథాంశం మనకు శ్రీమద్ భాగవత పురాణంలోని ఏడవ స్కంధంలో సవివరంగా కనిపిస్తుంది. అలాగే వరాహ పురాణం, తులసీదాసు రచించిన రామచరితమానస్ లోని బాలకాండలో కూడా ఈ 'జయ విజయ' శాప వృత్తాంతం ప్రస్తావించబడింది. భగవంతుడు తన భక్తులను ఉద్ధరించడానికి, వారికి మోక్షాన్ని ప్రసాదించడానికి రకరకాల లీలను ప్రదర్శిస్తాడని పురాణాలు నిరూపిస్తున్నాయి.

Share This Article:

నారాయణవనం బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగింపు

June 6, 2026

 Tirumala Tirupati Devasthanams ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బ్రహ్మోత్సవాలు నారాయణవనంలో భక్తి శ్రద్ధలతో, సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించేలా జరిగాయి. ...

View Post

తిరుమల అప్డేట్: భక్తుల భారీ రద్దీ — దర్శనానికి సుమారు 15 గంటల నిరీక్షణ

June 6, 2026

Tirumalaలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో సాధారణ దర్శనానికి సుమారు 15 గంటల సమ...

View Post

తిరుమల లడ్డూ విక్రయాల్లో రికార్డు: మే నెలలో 1.21 కోట్ల లడ్డూల అమ్మకాలు

June 4, 2026

తిరుమలలో భక్తుల రద్దీతో పాటు లడ్డూ ప్రసాదానికి ఉన్న డిమాండ్ కొత్త రికార్డును సృష్టించింది. 2026 మే నెలలో ఏకంగా 1.21 కోట్ల లడ్డూలు విక్...

View Post

కల్తీ నెయ్యి కేసు: పలు ప్రాంతాల్లో ఈడీ విస్తృత సోదాలు

June 4, 2026

కల్తీ నెయ్యి (Adulterated Ghee) సరఫరా వ్యవహారానికి సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా పలు ప్రాంత...

View Post

పెన్నహోబిళ ఆలయ అభివృద్ధికి భారీ ప్రణాళికలు – భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి

June 3, 2026

పెన్నహోబిళలోని ప్రసిద్ధ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి భారీ స్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు దేవాదాయ శాఖ అధికారు...

View Post

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ – 10 గంటల్లోనే శ్రీవారి దర్శనం పూర్తి

June 3, 2026

 తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పరిధిలోని తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఈ రోజు తగ్గినట్లు అధికారులు తెలిపారు. సాధారణ రోజులతో ...

View Post

Copyright © Venlax Devotional. All rights reserved.

👥 Total Site Visits: 127270