నారాయణవనం బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగింపు
June 6, 2026
Tirumala Tirupati Devasthanams ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బ్రహ్మోత్సవాలు నారాయణవనంలో భక్తి శ్రద్ధలతో, సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించేలా జరిగాయి. ...
View Post
కలలు కేవలం మన ఊహలు మాత్రమే కాదు, అవి భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను కూడా సూచిస్తాయి. కలలు వచ్చినప్పుడు, వాటిని మన కుటుంబ సభ్యులతో గానీ స్నేహితులతో గానీ పంచుకోవడం చాలా మందికి అలవాటు.. అయితే, డ్రీమ్ ఆస్ట్రాలజీ ప్రకారం.. కొన్ని కలలను ఎవరితోనైనా పంచుకుంటే అవి నిజంగానే జరుగుతాయట. ఒకవేళ ఎవరితోనైనా చెబితే అవి జరుగకపోవచ్చట. కాబట్టి వాటిని వీలైనంత రహస్యంగా ఉంచడమే ఉత్తమమని పండితులు చెబుతున్నారు. అలాంటి కొన్ని ప్రత్యేకమైన కలల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇలాంటివి ఎవరికీ చెప్పకండి.మీకు దేవుళ్ళు, దేవతలు, పుణ్యక్షేత్రాలు లేదా మతపరమైన ఆచారాల గురించి వచ్చిన కలలు అయితే, వాటిని ఎవరితోనూ పంచు కోకూడదట. ఇలాంటి కలలు భవిష్యత్తులో శుభవార్తలను సూచిస్తాయని డ్రీమ్ ఆస్ట్రాలజీ ఎక్స్ పర్ట్స్ వెల్లడిస్తున్నారు. ఇలాంటి కలలు ఆధ్యాత్మిక పురోగతిని కూడా సూచిస్తాయి. కాబట్టి ఇలాంటి కలలను ఇతరులతో పంచుకుంటే మీ ప్రయోజనాలకు ఆటంకం కలిగించవచ్చు.
మరణానికి సంబంధించిన కలలు..తన మరణం గురించి గానీ, లేదా ఇతరుల మరణం గురించి గానీ కల వస్తే, అది భయానకంగా ఉంటుంది. అయితే, డ్రీమ్ ఆస్ట్రాలజీ ప్రకారం.. అటువంటి కల మన సమస్యల ముగింపును, ఒక కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది. అయినప్పటికీ, ఈ కలను ఇతరులతో పంచుకోవడం దాని ప్రభావాన్ని తిప్పికొట్టవచ్చు. అందువల్ల, ఈ కలను ఎవరితోనూ పంచుకోక పోవడం బెటర్.
ఇలాంటి కలలను గురించి చెప్పవద్దు..ఒక వ్యక్తి తన కలలో డబ్బు, బంగారం లేదా వెండితో నిండిన కుండను చూస్తే, ఈ కల సమీప భవిష్యత్తులో ఆకస్మిక ధనలాభాన్ని సూచిస్తుంది. ఒకవేళ ఇలాంటి కల వస్తే ఇతరులతో పంచుకోవడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందని, ఈ కల ప్రయోజనాలను మీరు పూర్తి స్థాయిలో పొందకపోవచ్చు.
డ్రీమ్ ఆస్ట్రాలజీ ప్రకారం.. , నదులు, పర్వతాలు లేదా పచ్చని తోటలు వంటి ప్రకృతి సౌందర్యాన్ని కలలలో కనిపించడం కూడా జీవితంలో సానుకూల మార్పులను సూచిస్తుంది. ఇలాంటి కలను ఎవరికీ చెప్పకపోవడం ఉత్తమం అని పండితులు వెల్లడిస్తున్నారు.
June 6, 2026
Tirumala Tirupati Devasthanams ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బ్రహ్మోత్సవాలు నారాయణవనంలో భక్తి శ్రద్ధలతో, సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించేలా జరిగాయి. ...
View PostJune 6, 2026
Tirumalaలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో సాధారణ దర్శనానికి సుమారు 15 గంటల సమ...
View PostJune 4, 2026
తిరుమలలో భక్తుల రద్దీతో పాటు లడ్డూ ప్రసాదానికి ఉన్న డిమాండ్ కొత్త రికార్డును సృష్టించింది. 2026 మే నెలలో ఏకంగా 1.21 కోట్ల లడ్డూలు విక్...
View PostJune 4, 2026
కల్తీ నెయ్యి (Adulterated Ghee) సరఫరా వ్యవహారానికి సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా పలు ప్రాంత...
View PostJune 3, 2026
పెన్నహోబిళలోని ప్రసిద్ధ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి భారీ స్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు దేవాదాయ శాఖ అధికారు...
View PostJune 3, 2026
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పరిధిలోని తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఈ రోజు తగ్గినట్లు అధికారులు తెలిపారు. సాధారణ రోజులతో ...
View Post