నారాయణవనం బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగింపు
June 6, 2026
Tirumala Tirupati Devasthanams ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బ్రహ్మోత్సవాలు నారాయణవనంలో భక్తి శ్రద్ధలతో, సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించేలా జరిగాయి. ...
View Post
సాధారణంగా ఏదైనా శుభకార్యం చేయాలంటే మంచి ముహూర్తం కోసం పంచాంగాలు చూడాలి, పండితులను సంప్రదించాలి. కానీ, ఏడాదిలో ముహూర్తంతో పనిలేకుండా ఏ శుభకార్యానికైనా తలపెట్టదగ్గ అత్యంత పవిత్రమైన రోజు 'అక్షయ తృతీయ'. ఈ ఏడాది ఈ పర్వదినం ఎప్పుడు వస్తోంది..? దీని ప్రత్యేకతలేమిటో తెలుసుకుందాం..
తిథి విశేషాలు..దృక్ పంచాంగం గణన ప్రకారం, ఈ ఏడాది వైశాఖ శుద్ధ తదియ తిథి ఏప్రిల్ 19వ తేదీన ప్రారంభమవుతోంది. తదియ ప్రారంభం..ఏప్రిల్ 19, 2026 (ఆదివారం) ఉదయం 10:49 గంటలకు. తదియ ముగియనున్నది..ఏప్రిల్ 20, 2026 (సోమవారం) ఉదయం 07:27 గంటలకు.
పండుగ తేదీ.. ఉదయ తిథి ప్రాశస్త్యం ప్రకారం, ఏప్రిల్ 19, 2026 నాడు అక్షయ తృతీయ పర్వదినాన్ని జరుపుకోవాలి.
అభూజ ముహూర్తం..అంతులేని శుభఫలం..!అక్షయ తృతీయను శాస్త్రాలు 'అభూజ ముహూర్తం' స్వయంసిద్ధ ముహూర్తం,లేదా అభిజిత్ ముహూర్తం అని పిలుస్తాయి. అంటే ఈ రోజంతా పరమ పవిత్రమైనదే. వేద జ్యోతిష్యం ప్రకారం.. ఏడాదిలో ఎటువంటి దోషాలు లేని కొన్ని అరుదైన తిథుల్లో అక్షయ తృతీయ ప్రధానమైనది. ఈ రోజున వివాహాలు, గృహప్రవేశాలు, భూమి పూజలు, నూతన వ్యాపార ప్రారంభాలు లేదా వాహనాలు కొనుగోలు చేయడానికి ప్రత్యేకంగా ముహూర్తాలు చూడాల్సిన అవసరం లేదు. ఏ సమయంలోనైనా శుభకార్యాలు తలపెట్టవచ్చు.
స్వర్ణ యోగం..అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేయడం వల్ల సంపద వృద్ధి చెందుతుందని భక్తుల ప్రగాఢంగా విశ్వసిస్తారు.
బంగారం కొనుగోలుకు శుభ సమయం..?ఏప్రిల్ 19వ తేదీ ఉదయం 10:49 గంటల నుండి ఏప్రిల్ 20వ తేదీ తెల్లవారుజామున 06:14 గంటల వరకు స్వర్ణ లాభానికి అనుకూలమైన సమయం.
ఈ రోజున విశేషం..ఈ పవిత్ర దినాన చేసే జప, తప, హోమ, దాన ధర్మాలు అక్షయమైన అంటే తరిగిపోని ఫలితాలను ఇస్తాయి. అందుకే దీనిని 'అక్షయ' తృతీయ అని వ్యవహరిస్తారు. కొత్త ఆభరణాలు ధరించడం, భవిష్యత్తు కోసం మదుపు చేయడం ఈ రోజున అత్యంత శుభప్రదంగా భావిస్తారు.
June 6, 2026
Tirumala Tirupati Devasthanams ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బ్రహ్మోత్సవాలు నారాయణవనంలో భక్తి శ్రద్ధలతో, సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించేలా జరిగాయి. ...
View PostJune 6, 2026
Tirumalaలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో సాధారణ దర్శనానికి సుమారు 15 గంటల సమ...
View PostJune 4, 2026
తిరుమలలో భక్తుల రద్దీతో పాటు లడ్డూ ప్రసాదానికి ఉన్న డిమాండ్ కొత్త రికార్డును సృష్టించింది. 2026 మే నెలలో ఏకంగా 1.21 కోట్ల లడ్డూలు విక్...
View PostJune 4, 2026
కల్తీ నెయ్యి (Adulterated Ghee) సరఫరా వ్యవహారానికి సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా పలు ప్రాంత...
View PostJune 3, 2026
పెన్నహోబిళలోని ప్రసిద్ధ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి భారీ స్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు దేవాదాయ శాఖ అధికారు...
View PostJune 3, 2026
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పరిధిలోని తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఈ రోజు తగ్గినట్లు అధికారులు తెలిపారు. సాధారణ రోజులతో ...
View Post