నారాయణవనం బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగింపు
June 6, 2026
Tirumala Tirupati Devasthanams ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బ్రహ్మోత్సవాలు నారాయణవనంలో భక్తి శ్రద్ధలతో, సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించేలా జరిగాయి. ...
View Post
హిందూ సంప్రదాయంలో, వాస్తు శాస్త్రంలో ఇంటి పరిసరాల శుభ్రతకు ఎంతో ప్రాధాన్యం ఉంది. 'లక్ష్మీదేవి ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో, అక్కడే కొలువై ఉంటుంది' అని పెద్దలు చెబుతుంటారు. అందుకే ఈనాడు మనం వాస్తు, ఆధ్యాత్మిక కోణంలో ఇంటిని శుభ్రపరిచేట ప్పుడు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాలను తెలుసుకుందాం...
సాధారణంగా సాయంత్రం వేళ, ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊడవకూడదని మన పెద్దలు వారిస్తుంటారు. ఇలా చేయడం వల్ల సిరిసంపదలకు అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మికి ఆగ్రహం తెప్పించినట్లవుతుందని, తద్వారా ఇంటికి దారిద్ర్యం దాపురిస్తుందని చెబుతున్నారు పండితులు.
అయితే, ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది ఉద్యోగాలకు వెళ్లి రాత్రి పూట ఇంటికి చేరుకుంటారు. లేదా ఇంట్లో ఏదైనా చిన్నపాటి శుభకార్యం జరిగినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో రాత్రివేళ ఇల్లు శుభ్రం చేయాల్సి వస్తుంది. ఇలాంటి సమయాల్లో ప్రతికూల ప్రభావాలు కలగకుండా ఉండేందుకు వాస్తు శాస్త్రం కొన్ని ప్రత్యేక పరిహారాలను సూచిస్తోంది.
సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊడవాల్సిన పరిస్థితి వస్తే.. వచ్చిన చెత్తను పొరపాటున కూడా ఇంటి బయట పారేయకూడదు. ఆ చెత్తను ఇంటి లోపల ఓ మూలన చెత్తబుట్టలో ఉంచి, మరుసటి రోజు ఉదయం మాత్రమే బయట పారేయాలి.
రాత్రి వేళ ఇల్లు ఊడ్చి చెత్తను బయట పడేయడం వల్ల లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్లిపోతుందని, ఆ స్థానంలో అలక్ష్మి అంటే దరిద్ర దేవత ప్రవేశిస్తుందని వాస్తు పండితులు చెబుతున్నారు. అలక్ష్మి ప్రవేశం వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, అశాంతి తలెత్తే అవకాశం ఉందని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి.
వాస్తు శాస్త్రం ప్రకారం కేవలం ఇల్లు ఊడ్చడానికే కాదు, మనం నిత్యం వాడే చీపురు కొనడానికి, మార్చడానికి కూడా కొన్ని నిర్దిష్టమైన నియమాలు ఉన్నాయి.
శనివారం శ్రేష్టకరం..మీ ఇంట్లోని పాత చీపురు పాడైపోయి, దాని స్థానంలో కొత్తది వాడటం ప్రారంభించాలనుకుంటే దానికి 'శనివారం' అత్యంత పవిత్రమైన, అనువైన రోజుగా పరిగణించబడుతుంది. శనివారం నాడు కొత్త చీపురు వాడకం మొదలుపెట్టడం శుభప్రదం.
కృష్ణ పక్షంలోనే కొనుగోలు..కొత్త చీపురును కొనుగోలు చేయడానికి ఎల్లప్పుడూ కృష్ణ పక్షాన్ని (పౌర్ణమి తర్వాత వచ్చే చీకటి రోజుల వ్యవధిని) మాత్రమే ఎంచుకోవాలి. ఈ సమయంలో కొనుగోలు చేయడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తులు ప్రవేశిస్తాయి.
శుక్ల పక్షంలో వద్దు..వాస్తు నిబంధనల ప్రకారం, శుక్ల పక్షంలో అంటే అమావాస్య తర్వాత వచ్చే వెన్నెల రాత్రులలో చీపురు కొనడం దురదృష్టానికి, అశుభానికి సంకేతంగా భావిస్తారు. కాబట్టి ఆ సమయంలో కొత్త చీపురు కొనుగోలుకు వీలైనంత వరకు దూరంగా ఉండటం మంచిది. ఈ చిన్నపాటి వాస్తు నియమాలను మన దైనందిన జీవితంలో అన్వయించుకోవడం ద్వారా ఇంట్లో సానుకూల శక్తి పెంపొందుతుందని, లక్ష్మీదేవి కటాక్షంతో ఆర్థిక వృద్ధి, కుటుంబంలో సుఖశాంతులు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.
June 6, 2026
Tirumala Tirupati Devasthanams ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బ్రహ్మోత్సవాలు నారాయణవనంలో భక్తి శ్రద్ధలతో, సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించేలా జరిగాయి. ...
View PostJune 6, 2026
Tirumalaలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో సాధారణ దర్శనానికి సుమారు 15 గంటల సమ...
View PostJune 4, 2026
తిరుమలలో భక్తుల రద్దీతో పాటు లడ్డూ ప్రసాదానికి ఉన్న డిమాండ్ కొత్త రికార్డును సృష్టించింది. 2026 మే నెలలో ఏకంగా 1.21 కోట్ల లడ్డూలు విక్...
View PostJune 4, 2026
కల్తీ నెయ్యి (Adulterated Ghee) సరఫరా వ్యవహారానికి సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా పలు ప్రాంత...
View PostJune 3, 2026
పెన్నహోబిళలోని ప్రసిద్ధ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి భారీ స్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు దేవాదాయ శాఖ అధికారు...
View PostJune 3, 2026
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పరిధిలోని తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఈ రోజు తగ్గినట్లు అధికారులు తెలిపారు. సాధారణ రోజులతో ...
View Post