Sanatha Secrets

చంద్రుడిని మనోకారకుడు అని ఎందుకు అంటారు..?


జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడిని ‘మనోకారకుడు’ మనస్సుకు అధిపతి అని పిలుస్తారు. మన ఆలోచనలు, భావోద్వేగాలు, మానసిక స్థితిగతులు అన్నీ చంద్రుడి ప్రభావంతోనే ముడిపడి ఉంటాయి. ఎవరైతే తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆందోళన లేదా అశాంతితో బాధపడుతుంటారో.. వారు సోమవారం నాడు పరమశివునితో పాటు చంద్రుడిని ఆరాధించడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి.

శివారాధనతో గ్రహ దోష నివారణ..

సోమవారం అంటేనే ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు అత్యంత ప్రీతికరమైన రోజు. శివుడు తన జటాజూటంలో చంద్రుడిని ధరించడం వల్ల, శివారాధన చేసే భక్తులపై చంద్రుని అనుగ్రహం త్వరగా కలుగుతుంది. జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నా లేదా చంద్ర దోషాలు ఉన్నా సోమవారం ఉపవాసం ఉండి శివాభిషేకం చేయడం వల్ల ఆ దోషాలు తొలగిపోతాయి. దీనివల్ల చేపట్టిన పనుల్లో విజయం సిద్ధించడమే కాకుండా, మానసిక స్థైర్యం పెరుగుతుంది.

దానధర్మాలు చేయడం వల్ల..

చంద్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి సోమవారం నాడు తెల్లని వస్తువులను దానం చేయడం విశేష ఫలితాలనిస్తుంది. పాలు, పెరుగు, బియ్యం లేదా తెల్లని వస్త్రాలను పేదలకు దానం చేయడం వల్ల జాతకంలో చంద్రుని బలం పెరుగుతుందని పండితులు సూచిస్తున్నారు.

పఠించాల్సిన శక్తివంతమైన మంత్రాలు..

పూజా సమయంలో ఈ మంత్రాలను జపించడం వల్ల మనసు నిర్మలంగా ఉంటుంది.
చంద్ర గాయత్రీ మంత్రం.. 'ఓం అమృతాంగయే విద్మహే కాలరూపాయ ధీమహి, తన్నో సోమః ప్రచోదయాత్.'
చంద్ర ధ్యాన శ్లోకం..'దధిశంఖతుషారాభం క్షీరోదార్ణవసంభవమ్ | నమామి శశినం సోమం శంభోర్ముకుటభూషణమ్ ||'
శివ మంత్రం.. 'ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్ | ఉర్వారుకమివ బంధనాన్మృత్యోర్ముక్షీయ మామృతాత్ ||' సరళ మంత్రం.. 'ఓం ఐం క్లీం సోమాయ నమః' లేదా 'ఓం నమః శివాయ'. నిత్యం ఒత్తిడితో సతమతమయ్యేవారు ఈ సోమవారం నియమాలను పాటించి, భక్తితో ఈ మంత్రాలను జపిస్తే కొన్ని రోజుల్లోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.

Share This Article:

నారాయణవనం బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగింపు

June 6, 2026

 Tirumala Tirupati Devasthanams ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బ్రహ్మోత్సవాలు నారాయణవనంలో భక్తి శ్రద్ధలతో, సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించేలా జరిగాయి. ...

View Post

తిరుమల అప్డేట్: భక్తుల భారీ రద్దీ — దర్శనానికి సుమారు 15 గంటల నిరీక్షణ

June 6, 2026

Tirumalaలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో సాధారణ దర్శనానికి సుమారు 15 గంటల సమ...

View Post

తిరుమల లడ్డూ విక్రయాల్లో రికార్డు: మే నెలలో 1.21 కోట్ల లడ్డూల అమ్మకాలు

June 4, 2026

తిరుమలలో భక్తుల రద్దీతో పాటు లడ్డూ ప్రసాదానికి ఉన్న డిమాండ్ కొత్త రికార్డును సృష్టించింది. 2026 మే నెలలో ఏకంగా 1.21 కోట్ల లడ్డూలు విక్...

View Post

కల్తీ నెయ్యి కేసు: పలు ప్రాంతాల్లో ఈడీ విస్తృత సోదాలు

June 4, 2026

కల్తీ నెయ్యి (Adulterated Ghee) సరఫరా వ్యవహారానికి సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా పలు ప్రాంత...

View Post

పెన్నహోబిళ ఆలయ అభివృద్ధికి భారీ ప్రణాళికలు – భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి

June 3, 2026

పెన్నహోబిళలోని ప్రసిద్ధ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి భారీ స్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు దేవాదాయ శాఖ అధికారు...

View Post

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ – 10 గంటల్లోనే శ్రీవారి దర్శనం పూర్తి

June 3, 2026

 తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పరిధిలోని తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఈ రోజు తగ్గినట్లు అధికారులు తెలిపారు. సాధారణ రోజులతో ...

View Post

Copyright © Venlax Devotional. All rights reserved.

👥 Total Site Visits: 127281