నారాయణవనం బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగింపు
June 6, 2026
Tirumala Tirupati Devasthanams ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బ్రహ్మోత్సవాలు నారాయణవనంలో భక్తి శ్రద్ధలతో, సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించేలా జరిగాయి. ...
View Post
ఆధ్యాత్మిక వెలుగులతో ప్రపంచాన్ని జాగృతం చేసిన క్రియా యోగ గురువులు, మరణాన్ని సైతం జయించిన మహాత్ములని భక్తులు విశ్వసిస్తారు. 'ఒక యోగి ఆత్మకథ' గ్రంథం ద్వారా విశ్వవ్యాప్త ఖ్యాతి గడించిన శ్రీ శ్రీ పరమహంస యోగానంద, మార్చి 7 (1952)న మహాసమాధి చెందగా.. ఆయన గురువు, 'కైవల్య దర్శనం' కర్త శ్రీ శ్రీ స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి సరిగ్గా 90 ఏళ్ల క్రితం అంటే 1936 మార్చి 9వ తేదీన మహాసమాధి స్థితిని అలంకరించారు. ఈ సందర్భంగా క్రియా యోగ విశిష్టతపై ప్రత్యేక కథనం..
మరణాన్ని జయించిన మహాత్ములు..యోగ సంప్రదాయంలో మరణం అనేది కేవలం దేహ త్యాగం మాత్రమే. సంపూర్ణ స్పృహతో శరీరాన్ని వదిలిపెట్టడమే మహాసమాధి. యోగానంద తన శిష్యులకు అభయమిస్తూ.. 'నేను మీతోనే నడుస్తాను, నా అదృశ్య హస్తాలతో మిమ్మల్ని నిరంతరం రక్షిస్తాను' అని 97 ఏళ్ల క్రితమే ప్రకటించారు. ఆయన గురువు శ్రీయుక్తేశ్వర్ గిరి కూడా తన శిష్యుల హృదయాలలో శాశ్వతంగా నివసిస్తానని వాగ్దానం చేశారు.
గురు శిష్యుల అనుబంధం..వారణాసి వీధుల్లో 17 ఏళ్ల ప్రాయంలో శ్రీయుక్తేశ్వర్‌ను కలిసిన యోగానంద.. తన గురువు కఠిన క్రమశిక్షణలో పదేళ్ల పాటు శిక్షణ పొందారు. మహావతార్ బాబాజీ అప్పగించిన దైవిక బాధ్యతను నెరవేరుస్తూ, శ్రీయుక్తేశ్వర్ తన శిష్యుడిని ప్రపంచ ప్రఖ్యాత యోగిగా తీర్చిదిద్దారు. యోగానంద ద్వారానే క్రియా యోగ సందేశం ఖండాంతరాలకు వ్యాపించింది.
విజ్ఞాన శాస్త్రానికి అందని అద్భుతం..క్రియా యోగ సాధన కేవలం ఆధ్యాత్మిక ప్రక్రియ మాత్రమే కాదు, అదొక ప్రాచీన విజ్ఞాన శాస్త్రం. నిరంతర శ్వాస ప్రక్రియ ద్వారా రక్తాన్ని డీకార్బొనేట్ చేయడం వల్ల శరీరం క్షీణించకుండా ఉంటుందని 'ఒక యోగి ఆత్మకథ' వివరిస్తోంది.
పరమహంస యోగానంద మహాసమాధి చెందిన 20 రోజుల తర్వాత కూడా ఆయన భౌతిక కాయం ఏమాత్రం చెడిపోకుండా ఉండటం యోగ శక్తికి నిదర్శనంగా నిలిచింది.
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన ఈ పురాతన విద్యను పతంజలి మహర్షి తదితరులు అభ్యసించారు. ఆధునిక యుగంలో మహావతార్ బాబాజీ ద్వారా లాహిరి మహాశయులకు, అక్కడి నుంచి శ్రీయుక్తేశ్వర్ గిరి మీదుగా యోగానందకు ఈ విద్య లభించింది.
గురువు ప్రేరణతో యోగానంద 1917లో రాంచీలో 'యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (YSS)', 1920లో లాస్ ఏంజిల్స్‌లో 'సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ (SRF)' సంస్థలను స్థాపించారు. నేటికీ ఈ సంస్థల ద్వారా లక్షలాది మంది క్రియా యోగ మార్గంలో పయనిస్తూ ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతున్నారు.
June 6, 2026
Tirumala Tirupati Devasthanams ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బ్రహ్మోత్సవాలు నారాయణవనంలో భక్తి శ్రద్ధలతో, సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించేలా జరిగాయి. ...
View PostJune 6, 2026
Tirumalaలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో సాధారణ దర్శనానికి సుమారు 15 గంటల సమ...
View PostJune 4, 2026
తిరుమలలో భక్తుల రద్దీతో పాటు లడ్డూ ప్రసాదానికి ఉన్న డిమాండ్ కొత్త రికార్డును సృష్టించింది. 2026 మే నెలలో ఏకంగా 1.21 కోట్ల లడ్డూలు విక్...
View PostJune 4, 2026
కల్తీ నెయ్యి (Adulterated Ghee) సరఫరా వ్యవహారానికి సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా పలు ప్రాంత...
View PostJune 3, 2026
పెన్నహోబిళలోని ప్రసిద్ధ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి భారీ స్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు దేవాదాయ శాఖ అధికారు...
View PostJune 3, 2026
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పరిధిలోని తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఈ రోజు తగ్గినట్లు అధికారులు తెలిపారు. సాధారణ రోజులతో ...
View Post