Sanatha Secrets

అక్షయ తృతీయ రోజున ఇలాంటి దానాలు చేస్తే.. తరగని సిరిసంపదలు మీసొంతం..!


వైశాఖ శుక్ల పక్ష తదియ... 'అక్షయ తృతీయ'. పేరుకు తగ్గట్టే ఈ రోజున చేసే ఏ చిన్న శుభకార్యమైనా, దానధర్మమైనా అక్షయమై ఫలితాన్నిస్తుందని శాస్త్ర వచనం. లక్ష్మీనారాయణుల అనుగ్రహం కోసం, దారిద్ర్య నిర్మూలన కోసం ఈ పవిత్రమైన రోజున ఆచరించాల్సిన విశిష్ట దానాల విశేషాలు మీకోసం..

ఏప్రిల్ 19వ తేదీ, 2026..

హిందూ ధర్మంలో అక్షయ తృతీయకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఏడాది (ఏప్రిల్ 19వ తేదీ, 2026 నాడు వచ్చే ఈ పర్వదినం సంపదకు, శ్రేయస్సుకు మూలమని పండితులు చెబుతుంటారు. ముఖ్యంగా ఈ రోజున చేసే 'రహస్య దానాలు' జాతక దోషాలను తొలగించి, ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కిస్తాయని నమ్ముతారు.

ఏమి దానం చేయాలి అంటే..?

జల పాత్రలు అంటే ఉదకుంభ దానం : ఎండలు మండిపోయే ఈ కాలంలో దాహార్తిని తీర్చడం పరమ పుణ్యం. నీటితో నిండిన మట్టి కుండను లేదా కలశాన్ని దానం చేయడం వల్ల పితృదేవతలు శాంతిస్తారు. ఇది ఇంట్లోకి సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది.

సత్తుపిండి,బెల్లం...

ఆరోగ్య రీత్యా, ఆధ్యాత్మిక రీత్యా సత్తుపిండిని దానం చేయడం శ్రేష్ఠం. ఇది పేదరికాన్ని దూరం చేసి, వ్యాపార వృద్ధిని కలిగిస్తుంది.

విసనకర్రలు..

వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించే విసనకర్రలను దానం చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. వృత్తిలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి.

శనగపప్పు..

బంగారం కొనలేని వారు శనగపప్పును దానం చేయవచ్చు. ఇది గురు గ్రహ అనుగ్రహాన్ని ప్రసాదించి, బంగారమంత పుణ్యఫలాన్ని ఇస్తుంది.

పాదరక్షలు, గొడుగులు..

పేదలకు గొడుగు లేదా చెప్పులను దానం చేయడం వల్ల రాహు-కేతువుల దుష్ప్రభావాలు తగ్గి, ఆకస్మిక ప్రమాదాల నుండి రక్షణ లభిస్తుంది.

దాన నియమాల ప్రకారం ఇవి గుర్తుంచుకోండి..!

పాత్రమెరిగి దానం చేయాలి.. అది ఆడంబరంగా కాకుండా అంతరంగ శుద్ధితో ఉండాలి. గుప్త దానం అంటే.. కుడి చేయి చేసే దానం ఎడమ చేతికి తెలియకూడదు అంటారు. ప్రశంసల కోసం కాకుండా నిస్వార్థంగా చేసే దానమే అత్యంత శక్తివంతమైనది.

అభిజిత్ ముహూర్తం..

పూజలు, దానాలు చేయడానికి అక్షయతృతీయ రోజున వచ్చే అభూజ ముహూర్తం లేదా అభిజిత్ ముహూర్తం అత్యంత ఫలవంతమైన సమయం.అయిష్టంగా ఇచ్చే దానం ఫలితాన్నివ్వదు. కాబట్టి గ్రహీత పట్ల గౌరవంతో, సంతోషకరమైన మనసుతో దానం చేయాలి. పాడైపోయిన వస్తువులు లేదా మాంసాహార సంబంధిత వస్తువులను దానం చేయకూడదు. ఈ అక్షయ తృతీయ నాడు మీ శక్తి కొలది దానధర్మాలు చేసి, ఆ లక్ష్మీనారాయణుల కృపకు పాత్రులు అవ్వాలని పండితులు సూచిస్తున్నారు.

Share This Article:

నారాయణవనం బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగింపు

June 6, 2026

 Tirumala Tirupati Devasthanams ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బ్రహ్మోత్సవాలు నారాయణవనంలో భక్తి శ్రద్ధలతో, సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించేలా జరిగాయి. ...

View Post

తిరుమల అప్డేట్: భక్తుల భారీ రద్దీ — దర్శనానికి సుమారు 15 గంటల నిరీక్షణ

June 6, 2026

Tirumalaలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో సాధారణ దర్శనానికి సుమారు 15 గంటల సమ...

View Post

తిరుమల లడ్డూ విక్రయాల్లో రికార్డు: మే నెలలో 1.21 కోట్ల లడ్డూల అమ్మకాలు

June 4, 2026

తిరుమలలో భక్తుల రద్దీతో పాటు లడ్డూ ప్రసాదానికి ఉన్న డిమాండ్ కొత్త రికార్డును సృష్టించింది. 2026 మే నెలలో ఏకంగా 1.21 కోట్ల లడ్డూలు విక్...

View Post

కల్తీ నెయ్యి కేసు: పలు ప్రాంతాల్లో ఈడీ విస్తృత సోదాలు

June 4, 2026

కల్తీ నెయ్యి (Adulterated Ghee) సరఫరా వ్యవహారానికి సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా పలు ప్రాంత...

View Post

పెన్నహోబిళ ఆలయ అభివృద్ధికి భారీ ప్రణాళికలు – భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి

June 3, 2026

పెన్నహోబిళలోని ప్రసిద్ధ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి భారీ స్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు దేవాదాయ శాఖ అధికారు...

View Post

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ – 10 గంటల్లోనే శ్రీవారి దర్శనం పూర్తి

June 3, 2026

 తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పరిధిలోని తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఈ రోజు తగ్గినట్లు అధికారులు తెలిపారు. సాధారణ రోజులతో ...

View Post

Copyright © Venlax Devotional. All rights reserved.

👥 Total Site Visits: 127302