Sanatha Secrets

దేవఋషి నారద జయంతి రోజున ఇలా చేస్తే . సకల పాపాలు తొలగిపోతాయి..


విశ్వ కల్యాణ కారకుడు, పరమ విష్ణు భక్తుడు అయిన దేవఋషి నారద ముని జన్మించిన పవిత్ర దినమే నారద జయంతి. నిరంతరం 'నారాయణ.. నారాయణ..' అనే నామస్మరణతో ముల్లోకాలను చుట్టివచ్చే నారదుడు, భగవంతుడికి భక్తుడికి మధ్య వారధిగా నిలుస్తారు. ఈ ఏడాది మే 2వ తేదీన నారద జయంతిని జరుపుకోబోతున్నాం. ఈ పవిత్ర పర్వదినాన శ్రీమన్నారాయణుడిని పూజిస్తే కష్టాలు తొలగి, సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

ముహూర్త విశేషాలు..

జ్యేష్ఠ మాస కృష్ణ పక్ష ప్రతిపద తిథి మే 1వ తేదీ రాత్రి 10:52 గంటలకు ప్రారంభమై, మే 3వ తేదీ తెల్లవారుజామున 12:49 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రాశస్త్యం మేరకు మే 2, 2026 (శనివారం) నాడు నారద జయంతిని నిర్వహించుకోవాలి.

శుభ సమయాలు..

బ్రహ్మ ముహూర్తం: ఉదయం 4:14 - 4:57
అభిజిత్ ముహూర్తం: ఉదయం 11:52 - మధ్యాహ్నం 12:45
గోధూళి ముహూర్తం: సాయంత్రం 6:56 - 7:17

పూజా విధానం..నియమాలు..

నారద జయంతి నాడు భక్తులు సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకోవాలి. శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజా మందిరాన్ని అలంకరించుకోవాలి. నారద ముని ఇష్టదైవం శ్రీమహావిష్ణువు. అందుకే ఈ రోజున ముందుగా విష్ణుమూర్తిని షోడశోపచారాలతో పూజించాలి. విష్ణువును ధ్యానించిన తర్వాత దేవఋషి నారదుడిని స్మరిస్తూ పూజ చేయాలి.

నైవేద్యం..

స్వామివారికి చందనం, కుంకుమ, సుగంధ పుష్పాలను సమర్పించాలి. నెయ్యితో చేసిన హల్వా, పంచామృతం, తాజా పండ్లను నివేదించాలి. విష్ణుమూర్తికి సమర్పించే ఏ నైవేద్యంలోనైనా తులసి దళం తప్పనిసరి. తులసి లేని నైవేద్యాన్ని హరి స్వీకరించడని భక్తుల నమ్మకం. పూజానంతరం భక్తిశ్రద్ధలతో హారతి ఇచ్చి, నారాయణ నామస్మరణ చేయాలి.
నారద జయంతి రోజున...ఏ ఏ మంత్రాలను జపించడం వల్ల మానసిక ప్రశాంతత, కార్యసిద్ధి కలుగుతాయి అంటే..?
ఓం విష్ణవే నమః
ఓం నమో నారాయణాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ

విష్ణు ధ్యాన శ్లోకం:

శాంతాకారం భుజంగశయనం పద్మనాభం సురేశం,
విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగమ్ |
లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యం,
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్ ||..

Share This Article:

నారాయణవనం బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగింపు

June 6, 2026

 Tirumala Tirupati Devasthanams ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బ్రహ్మోత్సవాలు నారాయణవనంలో భక్తి శ్రద్ధలతో, సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించేలా జరిగాయి. ...

View Post

తిరుమల అప్డేట్: భక్తుల భారీ రద్దీ — దర్శనానికి సుమారు 15 గంటల నిరీక్షణ

June 6, 2026

Tirumalaలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో సాధారణ దర్శనానికి సుమారు 15 గంటల సమ...

View Post

తిరుమల లడ్డూ విక్రయాల్లో రికార్డు: మే నెలలో 1.21 కోట్ల లడ్డూల అమ్మకాలు

June 4, 2026

తిరుమలలో భక్తుల రద్దీతో పాటు లడ్డూ ప్రసాదానికి ఉన్న డిమాండ్ కొత్త రికార్డును సృష్టించింది. 2026 మే నెలలో ఏకంగా 1.21 కోట్ల లడ్డూలు విక్...

View Post

కల్తీ నెయ్యి కేసు: పలు ప్రాంతాల్లో ఈడీ విస్తృత సోదాలు

June 4, 2026

కల్తీ నెయ్యి (Adulterated Ghee) సరఫరా వ్యవహారానికి సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా పలు ప్రాంత...

View Post

పెన్నహోబిళ ఆలయ అభివృద్ధికి భారీ ప్రణాళికలు – భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి

June 3, 2026

పెన్నహోబిళలోని ప్రసిద్ధ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి భారీ స్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు దేవాదాయ శాఖ అధికారు...

View Post

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ – 10 గంటల్లోనే శ్రీవారి దర్శనం పూర్తి

June 3, 2026

 తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పరిధిలోని తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఈ రోజు తగ్గినట్లు అధికారులు తెలిపారు. సాధారణ రోజులతో ...

View Post

Copyright © Venlax Devotional. All rights reserved.

👥 Total Site Visits: 127258