Sanatha Secrets

ఈ నాలుగు రాశుల వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలంటున్న జ్యోతిష్య పండితులు.. ఎందుకంటే..?


జ్యోతిష్య శాస్త్రంలో విలాసాలకు, సౌకర్యాలకు అధిపతిగా భావించే శుక్ర గ్రహ సంచారం ద్వాదశ రాశులపై పెను ప్రభావం చూపనుంది. ఇటీవల జరిగిన ఈ రాశి మార్పు కొన్ని రాశుల వారికి ఆర్థిక ఇబ్బందులతో పాటు అనారోగ్య సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు హెచ్చరిస్తున్నారు.

ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి..!

శుక్రుడి గమనంలో మార్పు వల్ల ఈ క్రింది రాశుల వారి జీవనశైలిలో ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది.

మేష రాశి: పెరుగుతున్న ఖర్చులు..

మేష రాశి వారికి ఈ సంచారం మిశ్రమ ఫలితాలను ఇచ్చినప్పటికీ, ఆర్థికంగా కొంత ఒత్తిడి పెరగవచ్చు. అనవసర ఖర్చులు ముంచుకొచ్చే ప్రమాదం ఉంది.

పొదుపుపై దృష్టి పెట్టండి. జీవిత భాగస్వామితో అనవసర వాదనలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం.

కన్య రాశి.. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి.

కన్యా రాశి వారు ఈ కాలంలో ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా కళ్లు, చర్మ సంబంధిత సమస్యలు వేధించవచ్చు. వృత్తిపరంగా ఒత్తిడి పెరిగినా నిలకడగా వ్యవహరించండి. ప్రేమ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు.

ధనుస్సు రాశి..కుటుంబ కలహాలు..

ఈ రాశి వారికి కుటుంబంలో అశాంతి నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. అనుకోని ప్రయాణాల వల్ల ధన వ్యయం కావడమే కాకుండా, వస్తువుల దొంగతనం జరిగే అవకాశం ఉంది. ప్రయాణాల్లో విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త వహించండి. బడ్జెట్ విషయంలో క్రమశిక్షణ పాటించండి.

కుంభ రాశివారి ప్రతిష్టకు భంగం..

కుంభ రాశి వారు తమ మాట తీరుపై సంయమనం పాటించాలి. రహస్య శత్రువుల వల్ల సామాజికంగా ఇబ్బందులు తలెత్తవచ్చు. ఎవరినీ అతిగా నమ్మవద్దు. సంబంధాల్లో పారదర్శకత పాటించడం వల్ల అపార్థాలను తొలగించుకోవచ్చు.

దోష నివారణకు పరిహారాలు..

శుక్రుడి ప్రతికూల ప్రభావం నుంచి బయటపడటానికి జ్యోతిష్య నిపుణులుకొన్ని పరిహారాలను సూచిస్తున్నారు.

మంత్ర జపం.. నిత్యం 'ఓం శున్ శుక్రాయ నమః' అనే మంత్రాన్ని 108 సార్లు పఠించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

దానధర్మాలు.. శుక్రవారం నాడు పేదలకు పెరుగు, పంచదార, కర్పూరం లేదా తెల్లని వస్త్రాలను దానం చేయడం వల్ల దోష తీవ్రత తగ్గుతుంది.

శుభ్రత.. నివసించే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. సుగంధ ద్రవ్యాలను (Perfumes) వాడటం వల్ల శుక్రుడు ప్రసన్నమవుతాడు.

స్త్రీ గౌరవం.. ఇంట్లోని స్త్రీలను తల్లి, భార్య, సోదరిలను గౌరవించడం, వారిని సంతోషంగా ఉంచడం ద్వారా మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది.

Share This Article:

నారాయణవనం బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగింపు

June 6, 2026

 Tirumala Tirupati Devasthanams ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బ్రహ్మోత్సవాలు నారాయణవనంలో భక్తి శ్రద్ధలతో, సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించేలా జరిగాయి. ...

View Post

తిరుమల అప్డేట్: భక్తుల భారీ రద్దీ — దర్శనానికి సుమారు 15 గంటల నిరీక్షణ

June 6, 2026

Tirumalaలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో సాధారణ దర్శనానికి సుమారు 15 గంటల సమ...

View Post

తిరుమల లడ్డూ విక్రయాల్లో రికార్డు: మే నెలలో 1.21 కోట్ల లడ్డూల అమ్మకాలు

June 4, 2026

తిరుమలలో భక్తుల రద్దీతో పాటు లడ్డూ ప్రసాదానికి ఉన్న డిమాండ్ కొత్త రికార్డును సృష్టించింది. 2026 మే నెలలో ఏకంగా 1.21 కోట్ల లడ్డూలు విక్...

View Post

కల్తీ నెయ్యి కేసు: పలు ప్రాంతాల్లో ఈడీ విస్తృత సోదాలు

June 4, 2026

కల్తీ నెయ్యి (Adulterated Ghee) సరఫరా వ్యవహారానికి సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా పలు ప్రాంత...

View Post

పెన్నహోబిళ ఆలయ అభివృద్ధికి భారీ ప్రణాళికలు – భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి

June 3, 2026

పెన్నహోబిళలోని ప్రసిద్ధ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి భారీ స్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు దేవాదాయ శాఖ అధికారు...

View Post

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ – 10 గంటల్లోనే శ్రీవారి దర్శనం పూర్తి

June 3, 2026

 తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పరిధిలోని తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఈ రోజు తగ్గినట్లు అధికారులు తెలిపారు. సాధారణ రోజులతో ...

View Post

Copyright © Venlax Devotional. All rights reserved.

👥 Total Site Visits: 127274