Sanatha Secrets

చార్ ధామ్ యాత్రకు వెళ్లే భక్తులకు అవసరమైన పర్ఫెక్ట్ గైడ్..


ప్రకృతి ఒడిలో కొలువై.. ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే ఉత్తరాఖండ్‌లోని పవిత్ర చార్ ధామ్ యాత్రకు వేళయింది. అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 19న యమునోత్రి, గంగోత్రి ధామాల తలుపులు తెరుచుకోవడంతో ఈ ఏడాది ఆధ్యాత్మిక పయనం అట్టహాసంగా ప్రారంభమైంది. హిమగిరుల సాక్షిగా సాగే ఈ యాత్రలో పాల్గొనే భక్తుల సౌకర్యార్థం ఉత్తరాఖండ్ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా రద్దీ నియంత్రణ, భద్రతా కారణాల దృష్ట్యా ప్రతి యాత్రికుడు ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి.

చతుర్థామ దర్శనం..

చార్ ధామ్ యాత్రలో భాగంగా భక్తులు నాలుగు ప్రధాన పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు.. యమునోత్రి..యమునా నది జన్మస్థానం.

గంగోత్రి..భాగీరథీ నది పుణ్యధామం.

కేదార్‌నాథ్..పంచకేదారాల్లో ప్రధానమైన శివక్షేత్రం.

బద్రీనాథ్.. వైకుంఠ సమానమైన మహావిష్ణువు నివాసం.

నమోదు ఎందుకు..?

లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు మెరుగైన వసతులు కల్పించడం, అత్యవసర సమయాల్లో వేగంగా సహాయం అందించడం మరియు యాత్రా మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడటం ఈ రిజిస్ట్రేషన్ ప్రధాన ఉద్దేశం.

ఆన్‌లైన్ ద్వారా ఎలా రిజిస్టర్ చేసుకోవాలి..?

ఇంటి నుంచే సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అధికారిక వెబ్‌సైట్ registrationandtouristcare.uk.gov.in ను సందర్శించాలి.

'Register/Login' విభాగంలో పేరు, ఫోన్ నంబర్, ఇమెయిల్ వివరాలతో ఖాతాను సృష్టించుకోవాలి.

మొబైల్‌కు వచ్చే OTP ద్వారా ధృవీకరణ పూర్తి చేయాలి.

లాగిన్ అయిన తర్వాత, యాత్రలో పాల్గొనే వారి వివరాలు, వయస్సు, ప్రయాణ తేదీలు, సందర్శించాలనుకుంటున్న క్షేత్రాలను ఎంచుకోవాలి.

గుర్తింపు కార్డు (ఆధార్/ఓటర్ ఐడీ/పాన్ కార్డ్) స్కాన్ కాపీని అప్‌లోడ్ చేయాలి.

ప్రక్రియ పూర్తయ్యాక మొబైల్‌కు URN (Unique Registration Number) వస్తుంది. దీని ఆధారంగా రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, యాత్ర ముగిసే వరకు భద్రపరుచుకోవాలి.

నేరుగా ఆఫ్‌లైన్లో కూడా చేసుకోవచ్చు..

సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన లేని వారు ఆందోళన చెందాల్సిన పనిలేదు. హరిద్వార్, రిషికేశ్, సోన్‌ప్రయాగ్, బర్కోట్ వంటి ప్రాంతాల్లో ప్రభుత్వం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది. అక్కడ బయోమెట్రిక్ లేదా ఫోటోమెట్రిక్ పద్ధతిలో మీ వివరాలను నమోదు చేయించుకుని యాత్రా అనుమతి పత్రాన్ని పొందవచ్చు. అయితే, రద్దీ దృష్ట్యా కొంచెం ముందుగానే కౌంటర్లకు చేరుకోవడం ఉత్తమం. హిమాలయాల్లో వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం కాబట్టి, యాత్రికులు తగినన్ని ఊలు దుస్తులు, అత్యవసర మందులను వెంట ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Share This Article:

నారాయణవనం బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగింపు

June 6, 2026

 Tirumala Tirupati Devasthanams ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బ్రహ్మోత్సవాలు నారాయణవనంలో భక్తి శ్రద్ధలతో, సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించేలా జరిగాయి. ...

View Post

తిరుమల అప్డేట్: భక్తుల భారీ రద్దీ — దర్శనానికి సుమారు 15 గంటల నిరీక్షణ

June 6, 2026

Tirumalaలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో సాధారణ దర్శనానికి సుమారు 15 గంటల సమ...

View Post

తిరుమల లడ్డూ విక్రయాల్లో రికార్డు: మే నెలలో 1.21 కోట్ల లడ్డూల అమ్మకాలు

June 4, 2026

తిరుమలలో భక్తుల రద్దీతో పాటు లడ్డూ ప్రసాదానికి ఉన్న డిమాండ్ కొత్త రికార్డును సృష్టించింది. 2026 మే నెలలో ఏకంగా 1.21 కోట్ల లడ్డూలు విక్...

View Post

కల్తీ నెయ్యి కేసు: పలు ప్రాంతాల్లో ఈడీ విస్తృత సోదాలు

June 4, 2026

కల్తీ నెయ్యి (Adulterated Ghee) సరఫరా వ్యవహారానికి సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా పలు ప్రాంత...

View Post

పెన్నహోబిళ ఆలయ అభివృద్ధికి భారీ ప్రణాళికలు – భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి

June 3, 2026

పెన్నహోబిళలోని ప్రసిద్ధ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి భారీ స్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు దేవాదాయ శాఖ అధికారు...

View Post

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ – 10 గంటల్లోనే శ్రీవారి దర్శనం పూర్తి

June 3, 2026

 తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పరిధిలోని తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఈ రోజు తగ్గినట్లు అధికారులు తెలిపారు. సాధారణ రోజులతో ...

View Post

Copyright © Venlax Devotional. All rights reserved.

👥 Total Site Visits: 127275