నారాయణవనం బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగింపు
June 6, 2026
Tirumala Tirupati Devasthanams ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బ్రహ్మోత్సవాలు నారాయణవనంలో భక్తి శ్రద్ధలతో, సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించేలా జరిగాయి. ...
View Post
ఇవాళ ఏప్రిల్ 10తేదీన వైశాఖ కాలాష్టమి. హైందవ సంప్రదాయంలో కాలభైరవ ఆరాధనకు ఈ రోజు ఎంతో విశేషమైనది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జాతకంలోని శని, రాహు దోషాల తీవ్రతను తగ్గించుకోవ డానికి, అప్పుల బాధల నుండి గట్టెక్కడానికి కాలాష్టమి నాడు చేసే పూజలు అద్భుత ఫలితాలను ఇస్తాయని పండితులు చెబుతున్నారు.
వైదిక క్యాలెండర్ ప్రకారం ప్రతి నెలా కృష్ణ పక్ష అష్టమిని 'మాస కాలాష్టమి'గా జరుపుకుంటాం. ఈ శుక్రవారం నాటి వైశాఖ కాలాష్టమి గృహస్థులకు, సాధకులకు విశేష ఫలప్రదం. ముఖ్యంగా అర్ధరాత్రి వేళ (నిశిత ముహూర్తం) చేసే పూజకు ప్రత్యేక శక్తి ఉంటుంది. మీ జీవితంలో దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడాలంటే ఈ క్రింది పరిహారాలు పాటించి చూడండి:
కాలభైరవుని వాహనం కుక్క. ఈ రోజున నల్ల కుక్కకు బెల్లంతో చేసిన రొట్టెను తినిపించడం వల్ల కాలభైరవుని అనుగ్రహం లభిస్తుంది. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి, పనుల్లో ఆటంకాలు తొలగుతాయి.
అక్షయ తృతీయ ఈ ఏడాదిఎప్పుడు వస్తోంది..? దీని ప్రత్యేకతలేమిటి..?
భైరవ ఆలయాన్ని సందర్శించి, ఆవాల నూనెతో నాలుగు ఒత్తుల దీపాన్ని వెలిగించాలి. నల్ల నువ్వులు, నల్ల పప్పు లేదా నల్లని వస్త్రాలను దానం చేయడం వల్ల శని దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఇంట్లో నిత్యం గొడవలు, అనారోగ్య సమస్యలు వేధిస్తుంటే.. కాలభైరవునికి తీపి రొట్టెను (బెల్లం లేదా పంచదారతో చేసినది) నైవేద్యంగా సమర్పించండి. ఇది ఇంట్లోని ప్రతికూల శక్తిని హరించి, ప్రశాంతతను చేకూరుస్తుంది.
కాలభైరవుడు న్యాయాధిపతి,ఆగ్రహ స్వరూపుడు. అందుకే ఆయన పూజలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.. ముఖ్య గమనిక..పూజ చేసే రోజు మాంసాహారం, మద్యపానానికి దూరంగా ఉండాలి. జంతువులను, ముఖ్యంగా కుక్కలను ఎట్టి పరిస్థితుల్లోనూ హింసించకూడదు. బలహీనులను వేధించడం లేదా ఇతరులను అవమానించడం వంటి పనులు చేస్తే భైరవ అనుగ్రహం లభించదు. మనస్సును ప్రశాంతంగా ఉంచి, భక్తితో 'ఓం కాలభైరవాయ నమః' అనే మంత్రాన్ని జపించడం శ్రేయస్కరం. ఈ పవిత్ర కాలాష్టమి రోజున నియమ నిష్టలతో భైరవయ్యను పూజించి, మీ కష్టాల నుండి శాశ్వత విముక్తిని పొందండి.
June 6, 2026
Tirumala Tirupati Devasthanams ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బ్రహ్మోత్సవాలు నారాయణవనంలో భక్తి శ్రద్ధలతో, సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించేలా జరిగాయి. ...
View PostJune 6, 2026
Tirumalaలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో సాధారణ దర్శనానికి సుమారు 15 గంటల సమ...
View PostJune 4, 2026
తిరుమలలో భక్తుల రద్దీతో పాటు లడ్డూ ప్రసాదానికి ఉన్న డిమాండ్ కొత్త రికార్డును సృష్టించింది. 2026 మే నెలలో ఏకంగా 1.21 కోట్ల లడ్డూలు విక్...
View PostJune 4, 2026
కల్తీ నెయ్యి (Adulterated Ghee) సరఫరా వ్యవహారానికి సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా పలు ప్రాంత...
View PostJune 3, 2026
పెన్నహోబిళలోని ప్రసిద్ధ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి భారీ స్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు దేవాదాయ శాఖ అధికారు...
View PostJune 3, 2026
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పరిధిలోని తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఈ రోజు తగ్గినట్లు అధికారులు తెలిపారు. సాధారణ రోజులతో ...
View Post