devotional news

పంచముఖ ఆంజనేయుని అవతార రహస్యం

హనుమంతుడు తన భక్తులను కాపాడేందుకు ధరించిన అరుదైన రూపాల్లో పంచముఖ ఆంజనేయ స్వరూపం ఎంతో ప్రత్యేకమైనది. రామాయణంలో అహిరావణ వధ ఘట్టంలో ఈ రూపం ఆవిర్భవించిందని పురాణ కథనం. పాతాళ లోకాన్ని పాలించే అహిరావణుడు శ్రీరామ, లక్ష్మణులను మాయోపాయంతో అపహరించి పాతాళానికి తీసుకెళ్ళినప్పుడు, వారిని రక్షించేందుకు హనుమంతుడు పాతాళానికి బయలుదేరాడు.

పాతాళంలో అహిరావణుడిని సంహరించాలంటే..?

పాతాళంలో అహిరావణుడిని సంహరించాలంటే ఒక ప్రత్యేక నియమం ఉండేది. ఐదు దిక్కుల్లో వెలుగుతున్న ఐదు దీపాలను ఏకకాలంలో ఆర్పితేనే అతని మరణం సాధ్యమయ్యేది. ఒక్క ముఖంతో, ఒక్క శ్వాసతో ఈ పని చేయడం అసాధ్యం. ఈ సమయంలోనే హనుమంతుడు తన శక్తిని ప్రదర్శిస్తూ పంచముఖ రూపాన్ని ధరించాడని, ఐదు ముఖాల ద్వారా ఏకకాలంలో ఐదు దీపాలను ఆర్పి అహిరావణుడిని వధించి శ్రీరామలక్ష్మణులను రక్షించాడని పురాణ గాథ.

ఐదు ముఖాల విశిష్టత ఏమిటి..?

పంచముఖ ఆంజనేయ స్వరూపంలో ప్రతి ముఖం ఒక్కో దిశకు, ఒక్కో శక్తికి ప్రతీక.

తూర్పు దిశ – హనుమాన్ ముఖం..ఇది స్వయంగా హనుమంతుని ముఖం. భక్తి, శక్తి, జ్ఞానానికి సంకేతం. ఈ ముఖాన్ని పూజిస్తే కోరికలు నెరవేరతాయని, జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయని నమ్మకం.

దక్షిణ దిశ – నరసింహ ముఖం..ఉగ్రరూపుడైన నరసింహస్వామి ముఖం శత్రు నాశనానికి, భయాన్ని పోగొట్టడానికి ప్రతీకగా భావిస్తారు.

పడమర దిశ – గరుడ ముఖం..గరుడ ముఖం విష దోషాలు, రోగాల నుంచి విముక్తినిచ్చే శక్తిగా చెబుతారు. ఈ ముఖాన్ని ఆరాధిస్తే ఆరోగ్య సమస్యలు తొలగుతాయని విశ్వాసం.

ఉత్తర దిశ – వరాహ ముఖం..వరాహ ముఖం సిరిసంపదలు, ఐశ్వర్యాన్ని ప్రసాదించే శక్తిగా పరిగణిస్తారు.

ఊర్ధ్వ ముఖం హయగ్రీవ ముఖం.. పైకి చూస్తున్న ఈ ముఖం జ్ఞానానికి, విద్యకు, మోక్షానికి ప్రతీక. విద్యార్థులు, జ్ఞాన సముపార్జన కోరుకునేవారు ఈ ముఖాన్ని ప్రత్యేకంగా కొలుస్తారు.

ఈ ఐదు ముఖాలు కలిపి సర్వశక్తులకు, సర్వ దిక్కులకు రక్షణ కల్పించే సమగ్ర శక్తిగా భక్తులు భావిస్తారు. అందుకే పంచముఖ ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే అష్ట దిక్కుల నుంచి వచ్చే ఆపదలు తొలగిపోతాయని, సర్వ కార్యాలలో విజయం సిద్ధిస్తుందని బలమైన నమ్మకం ఉంది. ముఖ్యంగా శని దోషాలు, గ్రహదోషాల నివారణకు, రాహు-కేతు ప్రభావాల ఉపశమనానికి ఈ స్వరూప ఆరాధన విశేష ఫలితాన్నిస్తుందని పండితులు చెబుతారు.

Warning: simplexml_load_file(): https://venlaxdevotionalnews.blospot.com/feeds/posts/default?alt:1: parser error : EntityRef: expecting ';' in /home/u791299667/domains/venlaxdevotional.com/public_html/devotional-news-details.php on line 74

Warning: simplexml_load_file(): on.replace('https://venlaxdevotionalnews.blospot.com/feeds/posts/default?alt=&ch in /home/u791299667/domains/venlaxdevotional.com/public_html/devotional-news-details.php on line 74

Warning: simplexml_load_file(): ^ in /home/u791299667/domains/venlaxdevotional.com/public_html/devotional-news-details.php on line 74

Warning: simplexml_load_file(): https://venlaxdevotionalnews.blospot.com/feeds/posts/default?alt:1: parser error : EntityRef: expecting ';' in /home/u791299667/domains/venlaxdevotional.com/public_html/devotional-news-details.php on line 74

Warning: simplexml_load_file(): place('https://venlaxdevotionalnews.blospot.com/feeds/posts/default?alt=&ch=1&js in /home/u791299667/domains/venlaxdevotional.com/public_html/devotional-news-details.php on line 74

Warning: simplexml_load_file(): ^ in /home/u791299667/domains/venlaxdevotional.com/public_html/devotional-news-details.php on line 74

Warning: simplexml_load_file(): https://venlaxdevotionalnews.blospot.com/feeds/posts/default?alt:1: parser error : EntityRef: expecting ';' in /home/u791299667/domains/venlaxdevotional.com/public_html/devotional-news-details.php on line 74

Warning: simplexml_load_file(): UsInRzIjoxNzg2MTAxNjU1MjY5NTAyfQ.7m9yWgoJUiLqwR7q8x6z1uErLuyz2B3p0oXXG5yt12k&sid in /home/u791299667/domains/venlaxdevotional.com/public_html/devotional-news-details.php on line 74

Warning: simplexml_load_file(): ^ in /home/u791299667/domains/venlaxdevotional.com/public_html/devotional-news-details.php on line 74

Warning: Attempt to read property "channel" on false in /home/u791299667/domains/venlaxdevotional.com/public_html/devotional-news-details.php on line 77

Warning: Attempt to read property "item" on null in /home/u791299667/domains/venlaxdevotional.com/public_html/devotional-news-details.php on line 77

Warning: foreach() argument must be of type array|object, null given in /home/u791299667/domains/venlaxdevotional.com/public_html/devotional-news-details.php on line 77

Copyright © Venlax Devotional. All rights reserved.

👥 Total Site Visits: 224162